మూసీ నదిలో గుర్తు తెలియని మృతదేహం కొట్టుకొచ్చింది. భారీ వర్షాలతో మూసీ ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో పోలీసులు, సహయక బృందాలు మృతదేహన్ని బయటకు తీయలేకపోయాయి. మూసీకి వరద మరింత పెరిగే ప్రమాదం ఉందని, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
మరోవైపు మూసీకి మరింత వరద పెరిగే ప్రమాదం ఉంది. పైన ఉన్న ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ల గేట్లు ఎత్తే అవకాశం ఉండటంతో మూసీ ఉగ్రరూపం దాల్చనుంది. చాదర్ ఘట్, శంకర్ నగర్, ముసారాం బాగ్, ఓల్డ్ మలక్ పేట్ వద్ద నీరు రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.