ఉన్నావ్లో బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో నిందితుడు బీజేపీ బహిష్కృత నేత కుల్దీప్ సింగ్ సెంగార్కు తాత్కాలిక బెయిల్ లభించింది. కూతురి వివాహం నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టును షెంగార్ ఆశ్రయించారు.
షింగార్ పిటిషన్ పై తాజాగా హైకోర్టు విచారణ జరిపింది. షింగార్ కు 15 రోజుల తాత్కాలిక బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో షెంగార్ ఈ నెల 27 నుంచి ఫిబ్రవరి 10 వరకు బయటకు రానున్నారు.
2017లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి బాలికపై ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ షెంగార్, అతని స్నేహితులు పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. కానీ ఫిర్యాదుపై సరిగా స్పందించకపోవడంతో దేశ వ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి.
ఆ తర్వాత బాధిత బాలిక తండ్రి హత్యకు గురయ్యారు. ఆ తర్వాత కోర్టులో కేసు విచారణ జరిగింది. ఆ సమయంలోనే బాధితురాలిపై హత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో బాధితురాలి బంధువులు ప్రాణాలు కోల్పోయారు. బాధితురాలికి, ఆమె తరఫున న్యాయవాదికి గాయాలయ్యాయి.
ఈ క్రమంలో కేసును లక్నో కోర్టు నుంచి ఢిల్లీకి సుప్రీం కోర్టు బదిలీ చేసింది. ఆ తర్వాత బాధితురాలు మరణించింది. ఈ కేసులో నేరం రుజువుకావడంతో షింగార్ కు ట్రయల్ కోర్టు శిక్ష విధించింది. ట్రయల్ కోర్టు తీర్పును కొట్టి వేయాలంటూ సెంగార్ 2019 డిసెంబర్ లో కోర్టును ఆశ్రయించారు.