ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్ పై రష్యా దాడిని ఖండిస్తూ ఐకరాజ్య సమితి భద్రతా మండలిలో అమెరికా, అల్బేనియాలు సంయుక్తంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఉక్రెయిన్ నుంచి బలగాలను రష్యా వెంటనే ఉపసంహరించుకోవాలని తీర్మానంలో డిమాండ్ చేసింది.
ఈ తీర్మానంపై భద్రతా మండలిలో ఓటింగ్ నిర్వహించారు. భద్రతా మండలిలో మొత్తం 15 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. ఓటింగ్ లో మొత్తం 11 దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేశారు. మరోవైపు భారత్, చైనా, యూఏఈ దేశాలు ఈ ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి.
భద్రతా మండలిలో 5 శాశ్వత సభ్య దేశాల్లో ఒకటైన రష్యా తనకున్న వీటో అధికారాన్ని ఉపయోగించి ముసాయిదాను తిరస్కరించింది. అయితే రష్యా నుంచి ఇలాంటి చర్యను తాము ముందే ఊహించినట్టు అగ్రరాజ్యం అమెరికా తెలిపింది. ఈ ఓటింగ్ ద్వారా అంతర్జాతీయ వేదికపై రష్యాను ఒంటరి దేశంగా చేశామని పేర్కొంది.
‘ ఈ తీర్మానాన్ని మాత్రమే రష్యా అడ్డుకోగలిగిందని అమెరికా రాయబారి లిండా థామస్ గ్రీన్‌ఫీల్డ్ అన్నారు. కానీ ప్రజా గళాన్ని, వాస్తవాలను, సిద్దాంతాలను, ఉక్రెయిన్ ప్రజలను మాత్రమ అడుకోలేరని ఆయన అన్నారు.