ఆహా వేదికగా బాలయ్య అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్ నడుస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ షోకు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు. అన్ స్టాపబుల్ షో టాప్ రేంజ్ కు వెళ్లింది. అయితే తాజాగా హూస్ట్ గా బాలయ్య, గెస్ట్ గా పవన్ కళ్యాణ్ ఇవాళ హైదరాబాద్ అన్నపూర్ణా స్టూడియోలో షూటింగులో పాల్గోన్నారు. దీంతో ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అన్నపూర్ణ అన్‌స్టాపబుల్ స్టూడియోలో పవన్ కళ్యాణ్ ఉన్న విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఇప్పటికే పెద్ద ఎత్తున అన్నపూర్ణ స్టూడియోకు చేరుకున్నారు. ముందుగా పాసులు తీసుకున్న వారిని మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ అంటే రెండు వైపులా పదునున్న కత్తిలాంటి వాడని ఆయన అభిమానులు చెబుతున్నారు. ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూ కూడా, సినిమాలు చేస్తున్నారు. ఈ రెండు విషయాల్లో బాలయ్య, ప్రశ్నలు వేసే అవకాశం ఉంది. రాజకీయాల్లో పొత్తుల విషయం పై కూడా పవన్ కళ్యాన్ ఇప్పటికే స్పష్టంగా చెప్పారు.
దీనిపై కూడా బాలయ్య ప్రశ్నలు వేసే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించడానికి ఎలాంటి వ్యూహాలు అమలు చేయబోతున్నారనే విషయంపై కూడా బాలయ్య ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వీరిద్దరి ఎపిసోడ్‌కు సంబంధించిన అప్ డేట్ ప్రొమో ఎప్పుడు రిలీజ్ అవుతుందని బాలయ్య, పవన్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. తాజాగా వైరల్ అవుతున్న ఫోటోలు చూస్తే.. పవన్ హుడి టైప్ డ్రెస్సులో స్టైలిష్‌గా కనిపించారు, బ్లాక్ కలర్ హుడీ డ్రెస్ ధరించారు పవర్ స్టార్.
పవన్ కారు దిగగానే బాలయ్య ఆయనను హగ్ చేసుకొని గ్రాండ్‌గా వెల్ కమ్ చెప్పారు. దీంతో అక్కడున్న అభిమానులంతా ఒక్కసారిగా అరుపులు కేకలు పెడుతూ సందడి చేశారు.
పవన్‌తో పాటు దర్శకులు త్రివిక్రమ్, క్రిష్ రానున్నారు. తాజాగా అన్‌స్టాపబుల్ సెట్స్‌లో NBK with PSPK అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఎపిసోడ్ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్నట్లు తెలుస్తుంది.దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్,క్రిష్, నిర్మాత నాగవంశీ ఈ షోని చూడడానికి రాగా.. బాలకృష్ణ ఫ్యామిలీ సైతం సెట్స్ కి వచ్చారు.
బాలయ్య చిన్న కూతురు తేజస్విని, చిన్నల్లుడు శ్రీభరత్ లు పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూసిన పరిస్థితి. ఇలా సెలబ్రెటీల్లోనే పోటీ ఉండటంతో అభిమానులని సెట్స్ లోకి అనుమతించలేదు ఆహ నిర్వాహకులు.పవన్ కల్యాణ్, నందమూరి బాలకృష్ణ టాక్ షోకి సంబంధించి అన్నపూర్ణ స్టూడియోలో భారీ పోస్టర్‌ను ఆవిష్కరించారు అల్లు అరవింద్. అన్‌స్టాపబుల్ 2 షోలో NBK with PSPK అనే పోస్టర్‌ను ఇద్దరు ఫోటోలతో చేశారు. ఈ పోస్టర్ ఆవిష్కరించగానే అభిమానులు భారీగా కేకలు పెట్టి ఆనందాన్ని వ్యక్తం చేశారు