నటసింహం బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఎన్ బీకే అన్ స్టాపబుల్-2 పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయింది. ఇందులో బాలయ్య, పవన్ మధ్య జరిగిన సరదా సంభాషణలను ఎంతో ఇంట్రెస్టింగ్ గా చూపించారు. గత ఏడాది చివర్లోనే పవన్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తవ్వగా.. త్వరలోనే ఎపిసోడ్ పార్ట్-1ని స్ట్రీమింగ్‌కి ఉంచబోతున్నారు. ఈ క్రమంలోనే ప్రొమోని రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ స్టేజిపైకి రాగానే.. బాలయ్య ‘ఈశ్వరా.. పవనేశ్వరా’ అంటూ పలకరించారు.
ఆ తర్వాత బాలయ్యని ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్ ‘నేను మీకు తెలుసు.. నా స్థానం మీ మనసు’ అంటూ అన్‌స్టాపబుల్ లో బాలకృష్ణ వాడే ట్యాగ్ లైన్ ని తన స్టైల్లో చెప్పారు. దీంతో బాలయ్య కూడా కేకలు వేస్తూ.. అనంతరం మీసం మెలేస్తూ కనిపించారు. అనంతరం బాలయ్య పలు ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు పవన్ ని అడిగారు. గుడుంబా శంకర్ సినిమాలో ప్యాంటుపై ప్యాంటు వేసి పాతికేళ్లు వయసు తగ్గావంటూ పవన్ ను మెచ్చుకున్నాడు. ఇక దర్శకుడు త్రివిక్రమ్ పవన్ మంచి ఫ్రెండ్స్ కదా అని బాలయ్య అడగ్గా ఫ్రెండ్స్ అవ్వాల్సి వచ్చిందని పవన్ తెలిపాడు.
ఇంట్లో రామ్ చరణ్ పవన్‌తో అంత క్లోజ్ ఎలా అయ్యాడని బాలయ్య ప్రశ్నించగా.. ఇంట్లో తాను దొరికిపోవడంతో క్లోజ్ అవ్వాల్సి వచ్చిందని పవన్ చెప్పుకొచ్చాడు. అటుపై పవన్‌కు తన అమ్మంటే భయమా, భార్య అంటే భయమా అని అడగ్గా.. దీనికి పవన్ ఎలాంటి సమాధానం ఇచ్చాడా అనే క్యూరియాసిటీని క్రియేట్ చేశారు. షో మధ్యలో సాయి ధరమ్ తేజ్ కూడా ఎంట్రీ ఇచ్చాడు.
ఆ తర్వాత పవన్ ను పలు సీరియస్ ప్రశ్నలు అడిగాడు బాలయ్య. మూడు పెళ్లిళ్ల గొడవ ఏంటని బాలయ్య అడగ్గా.. పవన్ సమాధానం కోసం అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఇంతటి మానసిక సంఘర్షణకు గురైన పవన్.. పవర్ స్టార్ ఎలా అయ్యాడని బాలయ్య అడగడంతో ఈ ఎపిసోడ్ పై ఆసక్తి క్రియేట్ అయ్యింది.