వెండి తెరతో పాటు బుల్లి తెర ప్రేక్షకులను అన్ స్టాపబుల్ షో ద్వారా అలరిస్తున్నారు బాలకృష్ణ. తాజాగా ఆయన చిత్రం వీర సింహ రెడ్డి కూడా విడుదలై అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఆ చిత్రంలో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ ఈ వేదిక పై సందడి చేశారు. బాలయ్య అడిగిన ఓ ప్రశ్నకి వరలక్ష్మి స్పందిస్తూ .. “మొదటి నుంచి కూడా నాకు సినిమాలంటే ఇష్టం.
అందువల్లనే నేను యాక్టింగ్ వైపు వెళతానని నాన్నతో చెప్పాను. ఇక్కడ నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదని చెప్పేసి నాన్న వద్దన్నారు” అంది. “అయితే నాకు యాక్టింగ్ అంటే ఇష్టం .. అదే చేస్తాను అని పట్టుబట్టి నాన్నను ఒప్పించాను.
సినిమాల్లోకి వచ్చిన తరువాత నాకు ఫలానా ప్రాజెక్టులో ఛాన్స్ ఇప్పించమని నాన్నను ఎప్పుడూ అడగలేదు. శరత్ కుమార్ కూతురుగా కాకుండా వరలక్ష్మిగా నాకు అవకాశాలు ఇవ్వమని నేను నిర్మాతలకు చెప్పాను” అన్నారు.
ఇంతవరకూ నేను చేసిన సినిమాలన్నీ నా టాలెంటుతో సంపాదించుకున్నవే. ఏ ఒక్క అవకాశం కూడా మా నాన్న ద్వారా రాలేదు. రావాలని నేను అనుకోలేదు. తెలుగులో నాకు ‘క్రాక్’ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక్కడ వరుస ఆఫర్లు వస్తున్నాయి. అందువల్లనే ఇక్కడికే షిఫ్ట్ అయ్యాను” అని చెప్పుకొచ్చింది.