నందమూరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షో కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ షో కు సంబంధించి విడుదల అయిన ప్రోమోస్ కూడా ఎన్నో వివాదాస్పద ప్రశ్నలు, గమ్మత్తైన సమాధానాలతో కట్ చేస్తున్నారు మేకర్స్. కాగా తాజా ఎపిసోడ్ కోసం ప్రోమోను డిఫరెంట్ గా కట్ చేశారు మేకర్స్. బాలయ్య మూడు ప్రశ్నలు అడగగా… దర్శకుడు రాజమౌళి ఒక్క సమాధానం కూడా ఇవ్వలేదు. దీని గురించి బాలయ్య అడగ్గా, రాజమౌళి ఇలా సమాధానం ఇచ్చాడు. సార్, చూసేవారికి ఇది ప్రోమో మాత్రమే అని తెలుసు. కాబట్టి నేను నా సమాధానాలను ఎపిసోడ్‌లో మాత్రమే వెల్లడిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక రాజమౌళిని అడిగిన ప్రశ్నలు చూసుకుంటే… రాజమౌళి తెల్లగడ్డం ఎందుకు పెంచాడనేది మొదటి ప్రశ్న కాగా, రెండోది నందమూరి బాలకృష్ణతో ఎప్పుడు సినిమా చేస్తాడు. ఇక మూడవ ప్రశ్న రాజమౌళితో కలిసి పనిచేసి బ్లాక్‌బస్టర్ కొట్టే హీరోలు ఆ తర్వాత కొన్ని ఫ్లాప్‌లు ఎందుకు చూస్తున్నారు ? అంటూ ఆసక్తికరంగా ప్రోమోను కట్ చేశారు నిర్వాహకులు.
కాగా రామ్ చరణ్, నాని, సునీల్ ప్రభాస్ వంటి హీరోలు రాజమౌళి సినిమా చేసిన తర్వాత ఫ్లాప్‌లను చవిచూశారు. మరి రాజమౌళి ఈ ప్రశ్నకు ఎలాంటి సమాధానం ఇస్తాడో చూడాలి. అది తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే.