యూపీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాజధాని లక్నోలోని ఇజ్రత్ గంజ్‌లో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలి పోయింది. భవనంలోని 15 కుటుంబాలు భవన శిథిలాల కింద చిక్కుకున్నట్టు సమాచారం. సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
ఘటనా స్థలంలో సహాయక చర్యలను సహాయక బృందాలు చేపట్టాయి. ఢిల్లీతో పాటు ఉత్తర భారత్‌లో ఈ రోజు భూమి కంపించింది. ఈ నేపథ్యంలో ప్రమాదం జరిగివుంటుందని అధికారులు భావిస్తున్నారు. భవనం కుప్పకూలిన ఘటనను డిప్యూటీ సీఎం బ్రజేష్ పతక్ ధ్రువీకరించారు.
ఈ ఘటనలో ఇప్పటి వరకు ముగ్గురు మరణించినట్లు అధికారులు తెలిపారు. మృత దేహాలను శిథిలాల కింద నుంచి బయటకు తీశారని చెప్పారు. మిగలిన వారిని శిథిలాల కింద నుంచి వెలికి తీసే చర్యలు కొనసాగుతున్నట్టు ఆయన వెల్లడించారు.
ఘటనపై ఆయన తీవ్ర దిగ్బ్రాంతి ఆయన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మరోవైపు అగ్నిమాపక సిబ్బంది కూడా ఘటనాస్థలికి చేరుకున్నాయి. శిథిలాల కింద 30 నుంచి 35 మంది చిక్కుకుని ఉంటారని డీజీపీ వెల్లడించారు.