యూపీలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంలో కాషాయజెండా ఎగురవేసిన బీజేపీ… వరుసగా రెండోసారి అధికారం చేపట్టేందుకు ఊవ్విళ్లూరుతుంది. ఇప్పటికే ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయిన బీజేపీ… పొత్తులపై కీలక ప్రకటన చేసింది.
యూపీలో రెండు చిన్న పార్టీలతో కలిసి బీజేపీ ఎన్నికల సంగ్రామంకు వెళ్లబోతుంది. నిషద్ పార్టీ, అప్నాదళ్ పార్టీలతో కలిసి బీజేపీ ఎన్నికలకు వెళ్లబోతుందని ఆ పార్టీ ఇంచార్జ్ ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. అయితే, సీట్ల పంపకంపై మాత్రం పార్టీలు ఎలాంటి ప్రకటన చేయలేదు. సరైన సమయంలో సీట్ల పంపకాలపై ప్రకటన చేస్తామన్నారు. రాబోయే ఎన్నికలు ప్రధాని మోడీ, సీఎం యోగిల తోనే ఫేస్ చేస్తామని, ప్రజలు మరోసారి తమపై నమ్మకం ఉంచుతారన్న విశ్వాసం ఉందని బీజేపీ తెలిపింది.
బీజేపీ దూకుడుతో ఎస్పీ, బీఎస్పీ కూడా తమ ఎన్నికల సన్నద్ధతను స్పీడప్ చేయబోతుండగా… కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీని సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికలకు వెళ్తుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.