దేశంలో ముస్లిం మహిళలు ధరించే బుర్కాన్ నిషేధించాలని ఉత్తరప్రదేశ్ కు చెందిన బీజేపీ నేత ఒకరు డిమాండ్ చేశారు. బుర్కా వల్ల దేశ భద్రతకు ప్రమాదకరమని అన్నారు. బుర్కాను ధరించిన వారు రాక్షస రాజు రావణుడి సోదరి శూర్పణక తో సమానమన్నారు. శ్రీలంక, చైనా, అమెరికా, కెనడా దేశాలు ఇప్పటికే ఆ దేశాల్లో బుర్కాన్ నిషేధించాయని చెప్పారు. బుర్కాను ఉగ్రవాదులు తమకు అనుకూలంగా తీసుకునే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని షహీన్ బాగ్ లో సీఏఏ కు వ్యతిరేకంగా నిరసన తెలిపే వారు బుర్కాను ఫ్యాషన్ గా ధరిస్తున్నారని…బుర్కా ఉగ్రవాదులు, దొంగలు, సంఘ విద్రోహ శక్తులు దాచుకోవడానికి ఉపయోగపడుతున్నాయని తెలిపారు. రామాయణంలో రాక్షసి శూర్పణక బుర్కా ధరించే అరేబియన్ ఎడారుల్లోకి పారిపోయిందని చెప్పారు.
ఇంతకీ ఈ వివాదస్పద వ్యాఖ్యలు చేసిందెవరో తెలుసా..? ఉత్తరప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రఘురాజ్ సింగ్ . కాంగ్రెస్, ఆప్ నేతలు సింగ్ వ్యాఖ్యలను వెంటనే ఖండించారు. బీజేపీ నేతలు కొందరు అవి ఆయన వ్యక్తి గతమని అన్నారు. పార్టీ మాత్రం ఆయనకు షోకాజ్ నోటీసు లిచ్చింది. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా…దిగజారుడు వ్యాఖ్యలు చేసినందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ నోటీసులో పేర్కొంది. రఘురాజ్ సింగ్ గతంలో కూడా ఇలాంటి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యానాధ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ విద్యార్ధులను సజీవ దహనం చేస్తానని హెచ్చరించారు.