కేంద్ర హోం మంత్రిని యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్ శనివారం కలిశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల, ముఖ్యమంత్రుల సమావేశానికి హాజరయ్యేందుకు ఆయన ఢిల్లీ వచ్చారు.
సమావేశం అనంతరం ఆయన అమిత్ షాను కలిసినట్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో వెల్లడించింది. ట్వీట్ లో అమిత్ షాకు యోగీ ఓ పుస్తకాన్ని బహుకరిస్తున్న ఫోటోను పెట్టింది.
సూర్యకాంత్ బలీ రచించిన టర్మ్స్ ఆఫ్ అండస్టాండింగ్ ఇండియా అనే పుస్తకాన్ని అమిత్ షాకు యోగీ ఇచ్చినట్టు ట్వీట్ లో పేర్కొంది. యూపీ సీఎంగా యోగీ బాధ్యతలు చేపట్టి నెల రోజులు దాటిన క్రమంలో ఈ భేటీ జరిగినట్టు తెలుస్తోంది.
రాష్ట్రంలో పరిస్థితులపై అమిత్ షాతో ఆయన చర్చించినట్టు సమాచారం. ఈ సందర్భంగా పలు అంశాలపై వారిద్దరూ చర్చించినట్టు తెలిసింది. గత 30 రోజుల్లో యూపీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను అమిత్ షాకు వివరించినట్టు తెలుస్తోంది.