ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యానాధ్ బుధవారం అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి తెరతీశాయి. యూపీలో గత ఏడాది డిసెంబర్ లో సీఏఏ కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు హింసాత్మక సంఘటనలకు దారి తీసి 20 మంది చనిపోయారు. దీనిపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ…” ఎవరైనా చావడానికి వస్తున్నారంటే…ఎలా బతుకుతాడు..? అని ప్రశ్నించారు.
అసెంబ్లీలో ముఖ్యమంత్రి యోగి ఆధిత్యానాథ ప్రసంగింస్తూ…పోలీస్ బుల్లెట్ల వల్ల ఒక్కరు కూడా చనిపోలేదు…బుల్లెట్లతో చనిపోయిన వారంతా అల్లరి మూకల బుల్లెట్ల కారణంగానే చనిపోయారు..ఎవరైనా ప్రజలను కాల్చి చంపాలనే ఉద్దేశ్యంతో వెళ్తే…అతనైనా చస్తాడు…లేక పోలీసులైనా చస్తారు అని అన్నారు.
సీఏఏ కు వ్యతిరేకంగా నిరసన తెలిపే వారిని టార్గెట్ చేస్తూ సీఎం ఆధిత్యానాథ్ మాట్లాడారు. నిరసనకారులు ”ఆజాదీ” స్లోగన్స్ లేవనెత్తుతున్నారు. ఆజాదీ అంటే ఏంటి? మేము జిన్నా కలలకు అనుగుణంగా పనిచేయాల్నా..? లేక గాంధీ కలలకు అనుగుణంగా పనిచేయాల్నా..? అని ప్రశ్నించారు. డిసెంబర్ లో పోలీసులు బాగా పనిచేశారు. రాష్ట్రంలో అల్లర్లు లేవు అని కితాబిచ్చారు.
గంటకు పైగా మాట్లాడిన ముఖ్యమంత్రి…నిరసనలకు తాము వ్యతిరేకం కాదని..అయితే హింసకు పాల్పడితే మాత్రం ఊరుకోమన్నారు. ప్రజాస్వామిక నిరసనలకు వ్యతిరేకం కాదు..కానీ నిరసనల మాటున హింసకు పాల్పడితే వాళ్లకు ఆ భాషలోనే సమాధానం చెబుతామని హెచ్చరించారు.