కొంతమంది పోలీసుల్ని చూడగానే వీళ్ళకి ఉద్యోగం ఎవరిచ్చార్రా బాబు అనిపిస్తుంది.! చుట్టుకొలతలో ఎత్తు ఎగిరిపోతుంది. పొట్ట చూడగానే ఫిజికల్ ఫిట్ నెస్ అనే మాట అడ్రస్ లేకుండా పోతుంది. నడవడానికే ఆయాసపడే ఆ శరీరాన్ని చూసి పరుగన్నమాట ఎటోపరిగెడుతుంది.
పోలీసు లక్షణాల్ని కాసేపు వాయిదావేద్దాం. కనీసం సబ్జెక్ట్ అయినా లేక పోతే అలాంటి పోలీసులు వ్యవస్థకీ, సమాజానికీ అవసరమా…! ఉత్తర్ ప్రదేశ్ సంత్ కబీర్ నగర్ జిల్లాలో డిఐజీ చేసిన తనిఖీలో ఓ ఎస్ గన్ లోడ్ చెయ్యడానికి చేసిన కామెడీ చూస్తే ఇలాంటి పోలీసుల రక్షణలో మనం ఉన్నాం అని అనిపించక మానదు.
డీఐజీ ఆర్కే భరద్వాజ్ ఒక పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్‌లో ఉన్న రైఫిల్ ఎలా వినియోగిస్తారో చూపాలని అక్కడున్న పోలీస్ అధికారులు, సిబ్బందిని ఆయన అడిగారు. కాగా, ఒక సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ)కి రైఫిల్‌లో బుల్లెట్‌ను ఎలా లోడ్ చేయాలో కూడా తెలియలేదు.
బుల్లెట్‌ను రైఫిల్ ముందు భాగం నుంచి లోపలకు నెట్టాడు. అనంతరం ఆ రైఫిల్‌ను పైకి ఎత్తి పట్టుకున్నాడు. ఈ విధంగా కాల్పులు జరిపితే ఎవరికీ గాయం కాదంటూ తనిఖీ కోసం వచ్చిన డీఐజీకి చెప్పాడు.
బుల్లెట్‌ను ఎలా అన్‌లోడ్ చేస్తావని ఆ ఎస్‌ఐని అడగ్గా, రైఫిల్‌ను కిందకు వంచడంతో అది బారెల్ నుంచి జారి వచ్చింది. ఇది చూసి ఆ డీఐజీతోపాటు అక్కడ ఉన్న మిగతా పోలీస్ అధికారులు నవ్వు కున్నారు.
మరోవైపు రైఫిల్‌లో బుల్లెట్లు ఎలా లోడ్ చేయాలో అన్నది నేర్చుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో రక్షణ పొందేలా శిక్షణ పొందాలని ఆ ఎస్‌ఐకి డీఐజీ సూచించారు. అయితే ఆ పోలీస్ అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో అన్నది తెలియలేదు. కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Viral Video: UP Cop Was Asked To Load A Gun.
OMG😜😜😜#UPPolice #ViralVideo pic.twitter.com/AHek8iGFdC— pratiksha (@Pratikshashrii) December 28, 2022