ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు లక్నో కోర్టులో ఊరట లభించింది. బుద్ధుడు, అశోకుని అనుచరులపై ఆర్ఎస్ఎస్ చీఫ్, ఇతర నాయకులు చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసును కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై విచారణకు లక్నో కోర్టు తిరస్కరించింది.
ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ తో పాటు కార్యకర్తలపై నమోదైన కేసును కొట్టివేస్తూ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ బ్రహ్మేంద్ర సింగ్ మౌర్య అనే వ్యక్తి లక్నో కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు.
.
అయితే రివిజన్ పిటిషన్‌లో ఎలాంటి మెరిట్ లేదని జిల్లా అదనపు న్యాయమూర్తి గుర్తించారు. దీంతో కేసు విచారణకు జిల్లా అదనపు న్యాయమూర్తి తిరస్కరించారు.
2016లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, ఇతర కార్యకర్తలు గౌతమ బుద్దుడు, అశోక చక్రవర్తి అనుచరులపై వ్యతిరేకంగా పలు వ్యాఖ్యలు చేశారని మౌర్య తన పిటిషన్ లో పేర్కొన్నారు.