యూపీ అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటి నుంచే రాజకీయం మొదలవుతోంది. 2022లో జరిగే ఎన్నికల కోసం పార్టీలు గ్రౌండ్ వర్క్‌ను షురూ చేశాయి. ఈ క్రమంలో వచ్చే యూపీ ఎన్నికల్లో తాము పోటీ చేస్తామంటూ ఆప్ అధినేత కేజ్రీనాల్ చేసిన వ్యాఖ్యలపై యూపీ మంత్రులు రగిలిపోతున్నారు. ఢిల్లీలో ఏం చేశారని.. యూపీలో కూడా పోటీ చేస్తామని వస్తారంటూ ఆ పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టారు. కొందరు మంత్రులు మరింత ముందుకొచ్చి.. ఢిల్లీలోని స్కూళ్లు, యూపీలోని స్కూళ్ల పరిస్థితి ఎలా ఉందో చర్చిద్దామా అంటూ ఆప్ నేతలకు సవాల్ విసిరారు.
యూపీ మంత్రుల సవాల్ ఢిల్లీ డిప్యూటీ ముఖ్యమంత్రి మనిశ్ సిసోడియా స్పందించారు. యూపీ మంత్రులు చేసిన చాలెంజ్‌కు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. డిసెంబర్ 22న లక్నో వస్తానని.. ఎవరూ తనతో చర్చకు సిద్ధమో చెప్పాలంటూ ప్రతిసవాల్ విసిరారు. దీంతో ఇరు రాష్ట్రాల అధికార పార్టీ నేతల మధ్య ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొంది.