లక్నో: మధ్యాహ్న భోజనం అంటే కనీసం అన్నం, చారు ఉంటుంది. లేదంటే రొట్టె, కూర వడ్డిస్తారు. కానీ, యూపీలో రోటీలోకి కూరగా ఉప్పు పెట్టారు. ఈ పచ్చి నిజం వీడియో ద్వారా చెబితే నేరమా…!
ఉత్తర ప్రదేశ్ మీర్జాపూర్ స్కూలు పిల్లలకు రోటీ…ఉప్పు మధ్యాహ్న భోజనంగా అందించిన దృశ్యాన్ని చిత్రీకరణ చేసి ప్రసారం చేయడం నేరమైంది. ఆ జర్నలిస్ట్ పవన్ కుమార్ జైస్వాల్‌పై కేసు నమోదు చేశారు. కుట్రతోనే అలా వీడియో తీసి వైరల్ చేశాడని అధికారులు ప్రత్యారోపణ చేశారు. దీనిపై జర్నలిస్టులు మండిపడుతున్నారు. వారి ఆందోళనలు ఉధృతం అయ్యాయి.
ఇది ఒకరోజు జరిగిన సంఘటన మాత్రమేనని మీర్జాపూర్ జిల్లా మేజిస్ట్రేట్ అనురాగ్ పటేల్ అంటున్నారు. చిన్నారులు రోటీలో కూర లేకుండా ఉప్పుతో తింటుంటే చర్య తీసుకోవాల్సింది పోయి బుకాయింపులు…జర్నలిస్టులపై కేసులు… ఇదేమి తీరు…!?