పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో ఆస్తుల విద్వంసానికి పాల్పడిన వారు వారం రోజుల్లో నష్ట పరిహారం చెల్లించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. వారం రోజుల్లో నష్ట పరిహారం చెల్లించకపోతే ఆస్తులను జప్తు చేస్తామని…ఆస్తులు లేని వారిని ప్రాసిక్యూట్ చేస్తామని హెచ్చరించింది.
ఇటీవల పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా లక్నో లో జరిగిన నిరసన ర్యాలీలు హింసాత్మకంగా మారాయి. పలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమయ్యాయి. ప్రజా ఆస్తులను ధ్వంసం చేసిన వారి పట్ల ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన ముఖ్యమంత్రి యోగి ఆధిత్యానాధ్ అన్నట్టుగానే ఆస్తుల విధ్వంసానికి పాల్పడిన వారిని సీసీటీవీ పుటేజ్, ఫోటోల ఆధారంగా గుర్తించారు. అలా గుర్తించిన 150 మందికి నష్ట పరిహారం చెల్లించాల్సిందిగా నోటీసులు పంపారు. అయితే వారి నుంచి స్పందన లేకపోవడంతో అధికారులు వారం రోజుల డెడ్ లైన్ విధించారు. వారం రోజుల్లో నష్ట పరిహారం చెల్లించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.