కోపం,ద్వేషం,పగ వంటివి మనిషిని జంతువుని చేసే లక్షణాలు. విచిత్రం ఏంటంటే ఇలాంటి లక్షణాలేవీ జంతువుల్లో దాదాపు కనిసించవు. మనుషులలోనే పుష్కలంగా ఉంటాయి. ఒకరిని ఎదుర్కోగల సత్తా లేనప్పుడు, ఆ పగని వారికి సంబంధించిన వాటిని నాశంనం చేయద్వారా తీర్చుకుంటారు.
ఇది మనుషుల నైజంలో ఒకటి. అలాంటి సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్‌లోని షహ్‌జాన్‌పూర్ జిల్లా తానా సదర్ బజార్‌లో చోటుచేసుకున్నది. తాను ప్రేమగా పెంచుకుంటున్న పిల్లిని పక్కింటాయన ఎత్తుకెళ్లాడనే అనుమానంతో… అతనికి చెందిన 30 పావురాలను చంపేశాడు.
తానా సదర్ బజార్‌కు చెందిన అబిద్, వారిస్ అలీ ఇరుగురుపొరుగు. అబిద్ ఓ పిల్లిని పెంచుకుంటున్నాడు. పక్షి ప్రేమికుడైన పక్కింట్లో ఉండే వారిస్ అలీ..78 పావురాలను సాకుతున్నాడు. అయితే ఓ రోజు అకస్మాత్తుగా పిల్లి కనిపించకుండా పోయింది.
దీంతో వారిస్ అలీయే తన పిల్లిని మాయం చేశాడని అతనిపై అనుమానం పెంచుకున్నాడు అబిద్. దీంతో మరో ముగ్గురితో కలిసి విషం కలిపిన పదార్థాన్ని పావురాలకు ఆహారంగా వేశాడు. దానిని తిని 30 పావురాలు మరణించాయి.
వాటి యజమాని అయిన అలీ..పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పక్కింట్లో ఉండే అబీదే దీనికి కారణమని తేల్చిన పోలీసులు అతనితోపాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. అయితే మాయమైన పిల్లి.. మళ్లీ అబిద్ ఇంటికి తిరిగి రావడం విశేషం.