ఇటీవల పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ యూపీలో జరిగిన అల్లర్లలో గాయపడ్డ ఓమ్ రాజ్ సాహ్ని, అతని కుటుంబసభ్యలను మంత్రి కపిల్ దేవ్ అగర్వాల్ పరామర్శించారు. అయితే అదే ప్రాంతంలో పోలీస్ కాల్పుల్లో చనిపోయిన ఇద్దరు ముస్లింల కుటుంబ సభ్యులను పరామర్శించి వెళ్లేందుకు మంత్రి నిరాకరించడం వివాదస్పదమైంది.
మీడియా సమావేశంలో విలేకరులు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. మీరు గాయపడ్డ ఓమ్ రాజ్ సాహ్ని ఇంటికెళ్లి పరామర్శించారు..ప్రియాంక గాంధీ కూడా సాహ్నిని పరామర్శించింది. ఆ తర్వాత పోలీస్ కాల్పుల్లో చనిపోయిన ముస్లిం యువకుల కుటుంబ సభ్యులను కలిసింది అని గుర్తు చేశారు. ప్రభుత్వం ”సబ్ కా సాథ్…సబ్ కా వికాస్” అంటోంది కదా..మరి ముస్లిం కుటుంబాలను ఎందుకు కలవడం లేదని విలేకరులు ప్రశ్నించారు. తాను వివక్ష పాటిస్తున్నానని అనడం సరికాదు అన్న మంత్రి… అల్లర్లు చేసే వారి ఇంటికి తాను ఎందుకు వెళ్లాలి…అల్లర్లు సృష్టించే వాళ్లు..సమాజంలో భాగమెలా అవుతారు? ఇది హిందూ-ముస్లిం అంశం కాదు అన్నారు.
ఓమ్ రాజ్ సాహ్ని కుటుంబసభ్యులు చెప్పిన దాని ప్రకారం అతనికి ఏ అల్లర్లతో సంబంధం లేదని..పొలం నుంచి ఇంటికి వస్తుండగా అల్లరి మూకలు అక్రమ ఆయుధంతో దాడి చేశారని చెప్పారు.