ప్రధాని మోడీ
ఉత్తరప్రదేశ్ ను అల్లర్ల రహితంగా ఉంచాలంటే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండాల్సిందేనని ప్రధాని మోడీ అన్నారు. యూపీ ఎన్నికల ప్రకటించిన తర్వాత శహరాన్ పూర్ లో ఫిజికల్ ర్యాలీలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యర్థి పార్టీలపై విమర్శలతో విరుచుకుపడ్డారు.
‘ యూపీని అభివృద్ధి చేసిన వారికే ఓట్లు వేయాలన్న నిర్ణయానికి ఇక్కడి ప్రజలు వచ్చారు. ఎవరైతే యూపీని అల్లర్ల రహితంగా ఉంచగలరో, ఎవరైతే మన తల్లులు, పిల్లల భయాలను దూరం చేయగలరో, ఎవరైతే నేరస్తులను జైలుకు పంపగలరో వారికే ఓటు వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు” అని అన్నారు.
సమాజ్ వాదీ పార్టీ దాని మిత్ర బృందాన్ని టార్గెట్ చేసిన మోడీ.. ‘వారికి అధికారం ఇస్తే వ్యాక్సిన్ ను బహిరంగ మార్కెట్ లో అమ్ముతారు. తద్వారా వారు మీ జీవితాలతో ఆటలు ఆడుతారు” అటూ ధ్వజమెత్తారు.
ముజఫర్ నగర్, శహరాన్ పూర్ అల్లర్లను ప్రస్తావిస్తూ.. ‘ సమాజ్ వాదీ పార్టీ నేతలను అల్లర్ల మద్దతుదారులుగా మోడీ అభివర్ణించారు. వారు ఇప్పుడు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అవకాశం వస్తే యూపీ ప్రజలపై వారు ప్రతీకారం తీర్చుకుంటారు” అని అన్నారు.
” ముస్లిం సోదరీమణులకు ట్రిపుల్ తలాఖ్ నుంచి విముక్తి కల్పించాము. దీంతో ముస్లీం సోదరీమణులు బీజేపీకి మద్దతివ్వడం మొదలు పెట్టారు. దీంతో వారి ఓట్లను ఆశిస్తున్న కొన్ని పార్టీలు అసంతృప్తిగా ఉన్నారు. ముస్లీం సోదరీమణుల అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారు. ముస్లీం ఆడబిడ్డల పక్షాన నిలిచింది కేవలం బీజేపీ మాత్రమే” అని అన్నారు.