విధుల్లో చేరిన కొన్ని రోజులకే రూ.83 కోట్ల అవినీతిని బయటపెట్టాడో అధికారి. కానీ.. శత్రువులు అతడిపై ఏడుసార్లు కాల్పులకు తెగబడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. రింకు సింగ్ రాహీ ఉత్తరప్రదేశ్ అలీఘర్ జిల్లా దోరి నగరానికి చెందిన వ్యక్తి. ఇతను 2008లో పీఎస్‌సీ అధికారిగా సెలక్టయ్యారు. సోషల్ వెల్ఫేర్ అధికారిగా హపూర్ లో నియామకం జరిగింది. ఉద్యోగంలో చేరిన కొద్ది రోజులకే ఆ డిపార్ట్‌మెంట్ లోని రూ.83 కోట్ల రూపాయల అవినీతిని బయటపెట్టారు.
ఇది నచ్చని కొందరు అవినీతిపరులు ఒక ఉదయాన ఆయన ఇంటి వద్ద బ్యాడ్మింటన్ ఆడుతున్న సమయంలో 7 సార్లు కాల్పులు జరిపించారు. అదృష్టం కొద్ది రింకు ప్రాణాలు దక్కినప్పటికీ ఒక కన్ను, చెవి వినికిడి శక్తిని కోల్పొయారు. దాంతో కొన్ని నెలల పాటు ఉద్యోగానికి సెలవు పెట్టాల్సి వచ్చింది. ఇంత జరిగినా ప్రభుత్వం తనను పట్టించుకోలేదని రింకు ఓ సందర్భంలో తెలిపారు.
రాష్ట్రంలో కేవలం ప్రభుత్వాలు మాత్రమే మారుతున్నాయని కానీ.. సామాన్యుల పరిస్థితులు ఏ మాత్రం మారడం లేదని అన్నారు. బుల్లెట్ గాయాలు అవ్వడం వల్ల ఆయన ముఖం రూపు రేఖలు మారిపోయాయి. అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆయనను ఏకంగా వేరే డిపార్ట్ మెంట్ కు బదిలీ చేశారు. అంతే కాకుండా ప్రభుత్వం తరుఫున సివిల్ కోచింగ్ సెంటర్ లో కోచింగ్ ఇచ్చే వ్యక్తిగా నియమితులయ్యారు. దీంతో ఎంతోమంది విద్యార్థులకు తన జీవితాన్నే ఒక పాఠంగా చెబుతూ శిక్షణ ఇస్తున్నారు.
అదే సమయంలో యూపీఎస్సీ పరీక్ష రాసి 683వ ర్యాంకు సాధించారు రింకు. నిజానికి యూపీఎస్సీ పరీక్ష రాయడానికి ఆయన వయసు అనర్హం అయినప్పటికీ ఉన్న లోపాల వల్ల 40 ఏళ్ల వయసులోనూ సాధించగలిగారు. అంతేకాకుండా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.