పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఓ వైపు నిరసనలు వ్యక్తమవుతుండగా…. ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో 15 ఏళ్లుగా అక్రమంగా ఉంటున్న ఒక పాకిస్థాన్ మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంటెలిజెన్స్ విభాగం అందించిన నివేదిక అనంతరం ఆమెపై కేసు నమోదయ్యింది. ఆ మహిళను పాకిస్థాన్ కు చెందిన ఉజ్మా సలాల్‌గా పోలీసులు గుర్తించారు. దేశ విభజన అనంతరం ఈ మహిళ కుటుంబమంతా పాకిస్థాన్ వెళ్లిపోయింది. ఆ తర్వాత టూరిస్ట్ వీసాపై లక్నోకు వచ్చిపోతుండేది. 2004లో టూరిస్ట్ వీసాపై వచ్చిన ఆమె తిరిగి పాక్‌కు వెళ్లలేదు. పెళ్లి చేసుకుని పిల్లలతో పాటు ఇక్కడే ఉంటోంది.