UP లో రెండు పోస్టల్ స్టాంప్స్ విపరీతమైన చర్చ నడుస్తుంది. నెటీజన్లైతే UP పోస్టల్ డిపార్ట్మెంట్ ను టార్గెట్ చేస్తూ అనేక మీమ్స్ పెడుతున్నారు. దీనికి కారణం UP పోస్టల్ డిపార్ట్మెంట్ అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్, గ్యాంగ్ స్టర్ మున్నా భజరంగి లపై పోస్టల్ స్టాంపులను జారీ చేసింది.
ఛోటా రాజన్ ఫోటోను….5 రూ. 12 రూ ల స్టాంపులపై, మున్నా భజరంగి ఫోటోను 12 రూ. స్టాంపుపై ముద్రించింది. పోస్టల్ డిపార్ట్మెంట్ కొత్త స్కీమ్ ప్రకారం ఎవరైనా 600 ఫీజ్ కట్టి తమ పేరు మీద పోస్టల్ స్టాంప్ ను ముద్రించమని కోరవచ్చు…..ఫీజుతో పాటు మన ప్రమాణ పత్రాలను కూడా సమర్పించాల్సి ఉంటుంది. వీరి విషయంలో పోస్టల్ డిపార్ట్మెంట్ వీరి గురించి తెలుసుకోకుండా వీరి ఫోటోలను స్టాంపులపై ముద్రించడంతో మ్యాటర్ సీరియస్ అయ్యింది.