ఒసామా బిన్ లాడెన్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. ఒక విధంగా చెప్పాలంటే ఉగ్రవాదానికి జాతిపితగా అతడ్ని కొలిచే ముష్కరులు ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయిన లాడెన్ గురించి ఇప్పుడెందుకని అంటారా?ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ అధికారి లాడెన్ చిత్రాన్ని తన ఆఫీస్ లో పెట్టుకుని చిక్కుల్లో పడ్డాడు.
వివరాల్లోకి వెళ్తే.. రవీంద్ర ప్రకాశ్ గౌతమ్ దక్షిణ విద్యుత్ వితరన్ నిగమ్ లిమిటెడ్ లో సబ్ డివిజనల్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన తన కార్యాలయంలో లాడెన్ చిత్రాన్ని ఉంచి ‘ప్రపంచ ఉత్తమ జూనియర్ ఇంజనీర్’ అని పేర్కొన్నాడు.
అయితే.. ఇది కాస్తా వాట్సప్ గ్రూప్ లలో వైరల్ అయింది. అటూ ఇటూ తిరిగి ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. చివరకు రవీంద్రను విధుల నుంచి తొలగించారు. లాడెన్ చిత్రాన్ని అతను రాసిన ప్రపంచ ఉత్తమ జూనియర్ ఇంజనీర్ పదాల్ని గుర్తించామని తెలిపారు.
దీనిపై విచారణ జరుపుతున్నట్లు ఫరుఖాబాద్ జిల్లా మేజిస్ట్రేట్ సంజయ్ కుమార్ సింగ్ అన్నారు. ఆయన ఇలా ఎందుకు ప్రవర్తించారో వివరాలు తెలుసుకుంటున్నట్లు చెప్పారు.