యూపీలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 11 మంది ప్రయాణీకులతో వెలుతున్న ఎస్‌యూవీ వెహికిల్ ఆగి ఉన్న వాహనాన్ని బలంగా ఢీకొట్టంది. వివాహానికి వెళ్లివస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనలో 8 మంది మరణించినట్టు అధికారులు తెలిపారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలైనట్టు వెల్లడించారు. క్షతగాత్రులను సమీపంలో ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. గాయాలపాలైన వారికి రూ. 50000 నష్టపరిహారం ఇవ్వనున్నట్టు చెప్పారు.
మరో వైపు ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ కూడా స్పందించారు. మృతులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తామని హామి ఇచ్చారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.