వ్యాపారమనే కాదు,ఏ ఫీల్డు కాంపిటేషన్ మీదే నడుస్తుంది. కష్టమర్లని ఆకట్టుకోవాలంటే ఆఫర్ల అవసరం ఎంతైనా ఉంది. ఓ ఇమేజ్ క్రియేట్ అయ్యేవరకూ ఆఫర్ల కంపల్సరీ అనడంలో డౌట్ లేదు.ఈ ఆఫర్లలో కూడా సాదాసీదాగా ఉంటే జనానికి ఎక్కదు.దానికి కొంతలో కొంతైనా క్రియేషన్ అవసరం.
ఉత్తరప్రదేశ్ కు చెందిన బదోహిలో ఓ మొబైల్ షాప్ ఓనర్. కష్టమర్ క్రౌడ్ పుల్లింగ్ కోసం..ట్రెండీగా ఆలోచించాడు. ఓ విచిత్రమైన ఆఫర్ అనౌన్స్ చేసాడు. అదేంటంటే..! ఒక స్మార్ట్ ఫోన్ కొంటే రెండు బీర్లు ఫ్రీ.! అన్నాడు.
ఏ ఎండకు ఆ గొడుగు పట్టటం అంటే ఇదేనేమో కదా..!అసలే ఎండాకాలం..పైగా బీర్లు. దీంతో జనం పోటెత్తారు. అది బెల్ట్ షాపా…మొబైల్ షాపా అన్నంతగా తయారైంది పరిస్థితి.
చెప్పేదేముంది..!అక్కడ భారీ ట్రాఫిక్ జామ్ స్టార్ట్ అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు మనసు చంపుకుని ఆషాపు యజమానిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..ఉత్తరప్రదేశ్‌లోని భదోహిలో ఒక దుకాణదారుని పోలీసులు ప్రజా శాంతికి భంగం కలిగించినందుకు అరెస్టు చేశారు.
ఒక స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రెండు బీర్ బాటిళ్లను ఉచితంగా అందించే పథకాన్ని ప్రకటించాడు.అది కాస్తా భీబత్సంగా క్లిక్ అయ్యింది.ఆ తర్వాత అతని దుకాణం వద్ద పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. నిందితుల దుకాణాన్ని సీజ్ చేసినట్లు వారు తెలిపారు.
చౌరీ రోడ్‌లో మొబైల్ ఫోన్ దుకాణం నడుపుతున్న రాజేష్ మౌర్య మార్చి 3-7 మధ్య షాపింగ్ చేయండి.ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే వారికి రెండు బాటిళ్ల బీరు ఉచితంగా ఇస్తామని పోస్టర్లు, కరపత్రాలు, ప్రకటనల ద్వారా ప్రచారం చేశారని కొత్వాలి పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అజయ్ కుమార్ సేథ్ తెలిపారు.
పథకం గురించి జోరుగా ప్రచారం జరగడంతో, కస్టమర్లు అతని దుకాణానికి పోటెత్తారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసు సూపరింటెండెంట్ అనిల్ కుమార్ అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సాయంత్రం, పోలీసులు దుకాణం వద్ద గుమిగూడిన జనాన్ని చెదరగొట్టారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 151 (ప్రజా శాంతికి భంగం కలిగించడం) కింద మౌర్యను అరెస్టు చేశారు. అతని దుకాణాన్ని కూడా సీల్ చేసినట్లు పోలీసులు తెలిపారు.