ఉపాసన కొణెదల గర్భందాల్చిన విషయం తెలిసిందే. స్వయంగా చిరంజీవి ఈ విషయాన్ని బయటపెట్టారు. తను తాత కాబోతున్నట్టు ప్రకటించి సంబర పడ్డారు.
అయితే చిరు ప్రకటనతో పాటే ఊహాగానాలు కూడా చెలరేగాయి. ఉపాసన సహజసిద్ధంగా బిడ్డకు జన్మనివ్వడం లేదని, సరోగసీ ద్వారా ఆమె తల్లి కాబోతోందంటూ కొందరు కథనాలు రాశారు. దీనికి ఓ కారణం కూడా ఉంది.
చిరు ప్రకటన తర్వాత ఉపాసన నార్మల్ గానే కనిపించారు. పైగా చరణ్ తో కలిసి దేశవిదేశాలు తిరిగారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకలో కూడా మెరిశారు. దీంతో ఉపాసన సరోగసీ పద్ధతిని ఆశ్రయించారని అంతా అనుకున్నారు.
ఎట్టకేలకు ఈ ఊహాగానాలకు చెక్ పెట్టారు ఉపాసన. సంక్రాంతి సందర్భంగా కొత్త ఫొటోల్ని విడుదల చేసిన ఉపాసన, అందులో తన గర్భాన్ని చూపించారు. దీంతో ఇప్పటివరకు వచ్చిన పుకార్లన్నీ ఆగిపోయాయి.