కొన్ని రోజుల క్రితం ‘మాస్ట్రో’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించిన నితిన్.. ఇప్పుడు ‘మాచర్ల నియోజకవర్గం’తో మెప్పించడానికి సిద్ధమవుతున్నారు. భారీ పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రంతో ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
Its time to take my First Charge ✍️
Reporting as SIDDHARTH REDDY 😎
Meeku Nachhe , Meeru Mechhe
MASS tho Vastunaa :)))
#MacherlaNiyojakavargam🔥@IamKrithiShetty @CatherineTresa1 @SrSekkhar #SudhakarReddy #NikithaReddy #RajkumarAkella @SreshthMovies @adityamusic pic.twitter.com/7vaf5h9YjK— nithiin (@actor_nithiin) March 26, 2022
Advertisements
ఇక ఈ చిత్రంలో కృతి శెట్టి, కేథరిన్ ట్రెసా హీరోయిన్లుగా నటించగా, ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి శ్రేష్ట్ మూవీస్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి సంయుక్తంగా ఈ మూవీని నిర్మించనున్నారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన అప్డేట్స్ ఆసక్తిని పెంచేశాయి. ఈ సినిమాలో హీరో నితిన్ ఐఏఎస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్‌ను హీరో నితిన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ‘ ఇట్స్ టైం టూ టేక్ ఛార్జ్.. రిపొర్టింగ్ యాస్ సిద్ధార్థ్ రెడ్డి.. మీకు నచ్చే మీరు మెచ్చే మాస్ తో వస్తా’ అంటూ మాచర్ల నియోజకవర్గంలోని తన ఫస్ట్ లుక్‌ను హీరో నితిన్ విడుదల చేశారు.
ఇందులో నితిన్ సీరియస్‌గా, పవర్ ఫుల్‌గా కనిపిస్తున్నాడు. ఎప్పుడు డిఫరెంట్ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించే నితిన్.. ఇప్పుడు మునుపెన్నడూ చూడని మాస్, కఠినమైన పాత్రలో చూడబోతున్నట్లు ఈ ఫస్ట్ లుక్ ప్రెజెంట్ చేసింది. మొత్తానికి ఇంటెన్స్ ఫస్ట్ లుక్‌తో నితిన్ అందరి దృష్టిని ఆకర్షించారు.