దాదాపు 2 నెలలుగా కొనసాగిన అనిశ్చితి ఓ కొలిక్కి వచ్చింది. అత్యంత భారీ చిత్రం ఆర్ఆర్ఆర్ నుంచి మొదలుపెడితే, ఓ మీడియం రేంజ్ చిత్రం పక్కా కమర్షియల్ వరకు దాదాపు అన్ని పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ లాక్ అయ్యాయి.
ఫిబ్రవరి నెలాఖరుకు కరోనా పరిస్థితులు సద్దుమణిగి, థియేట్రికల్ వ్యవస్థ గాడిన పడుతుందని ఇండస్ట్రీ అంచనా వేస్తోంది. అందుకే నిర్మాతలంతా తమ సినిమాల విడుదల తేదీలు మరోసారి ప్రకటించారు. కొంతమంది పాత తేదీలకే కట్టుబడితే, మరికొంతమంది కొత్త తేదీలు విడుదల చేసి ఫ్యాన్స్ లో హుషారు పెంచారు.
రిలీజ్ డేట్స్ కు సంబంధించి రోజుకో అప్ డేట్ సోషల్ మీడియాలో వస్తోంది. ఏ రోజు ఏ సినిమా నుంచి అప్ డేట్ వస్తుందో కూడా అర్థం కావడం లేదు. అందుకే రాబోయే 3 నెలల్లో టాలీవుడ్ లో విడుదల కాబోయే ప్రముఖ చిత్రాల విడుదల తేదీల్ని ఇక్కడ మీకు అందిస్తున్నాం. ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఇవి ప్రస్తుతానికి లాక్ అయిన తేదీలు మాత్రమే. కరోనా పరిస్థితులు, ఏపీలో టికెట్ రేట్ల పెంపు లాంటి అంశాలపై ఈ విడుదల తేదీలు ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతానికైతే ఈ తేదీలు ఫిక్స్.
ఖిలాడీ ఫిబ్రవరి 11/18
సన్నాఫ్ ఇండియా ఫిబ్రవరి 18
వాలిమై (అజిత్) ఫిబ్రవరి 24
ఆడవాళ్లు మీకు జోహార్లు ఫిబ్రవరి 25
భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25/ఏప్రి 1
గని ఫిబ్రవరి 24/మార్చి 4
రాధేశ్యామ్ మార్చి 11
ఆర్ఆర్ఆర్ మార్చి 25
కేజీఎఫ్ 2 ఏప్రిల్ 14
బీస్ట్ (విజయ్) ఏప్రిల్ 14
రామారావు ఆన్ డ్యూటీ మార్చి 25/ఏప్రిల్ 15
ఎఫ్ 3 ఏప్రిల్ 28
ఆచార్య ఏప్రిల్ 29
సర్కారువారి పాట మే 12
పక్కా కమర్షియల్ మే 20
ఆదిపురుష్ ఆగస్ట్ 11
లైగర్ ఆగస్ట్ 25