ఆరు సంవత్సరాల చిన్నారిపై హత్యాచారం చేసి… ఓ బంగారు భవిష్యత్ ను చిదిమేసిన రాజుపై తీవ్ర విమర్శలొచ్చాయి. ఎన్ కౌంటర్ చేయాలని కొందరు, ఉరి తీయాలని మరికొందరు డిమాండ్ చేశారు. చివరకు నాటకీయ పరిణామాల మధ్య ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెప్తుండగా, పోలీస్ హత్య అని ప్రజా సంఘాలు ఆరోపించాయి.
కానీ, రాజుకు ఇప్పటికే పెళ్లైంది. రాజు చేయిపై ఉన్న మౌనిక అనే పేరు తన భార్యదే. రాజుకు ఇప్పటికే 11నెలల పాప ఉండగా, మౌనిక ప్రస్తుతం గర్భవతి అని తెలుస్తోంది. రాజు ఆత్మహత్య ఉదాంతంపై మౌనిక అమ్మ యాదమ్మ స్పందిస్తూ… తన కూతురు లాంటి పరిస్థితి మరో ఆడబిడ్డకు రావొద్దని ఆవేదన వ్యక్తం చేసింది. రాజు చచ్చి మంచి పనిచేశాడంటూనే, తన బిడ్డ ఇప్పుడు ఇద్దరు పిల్లలను ఎలా పెద్ద చేస్తుందో… అంటూ కన్నీరు పెట్టుకుంది.
మరోవైపు రాజు ఆత్మహత్యపై మౌనిక స్పందిస్తూ… ఇప్పుడు నా పరిస్థితి ఎంటో చెప్పాలని ఆవేదన వ్యక్తం చేసింది.