డిజిటల్ పేమెంట్స్ విభాగంలో భారత్ దూసుకు పోతోంది. గతేడాది రికార్డు స్థాయిలో యూపీఐ పేమెంట్స్ జరిగాయి. గ్రామాల నుంచి మొదలు పట్టణాల వరకు ఆన్ లైన్ పేమెంట్స్ పెరిగిపోవడమే ఇందుకు కారణమని అధికారులు చెబుతున్నారు. డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండియా వివరాల ప్రకారం…
ఒక్క డిసెంబర్ నెలలోనే భారతీయులు యూపీఐ పేమెంట్స్ ద్వారా మొత్తం రూ. 12.82 కోట్లను చెల్లించారు. మొత్తంగా ఒక నెలలో 782 కోట్లకు పైగా యూపీఐ ట్రాన్సక్షన్ చేశారు. ఈ మేరకు డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండియా ఓ ట్వీట్ చేసింది.
భారత్‌లో తీసుకు వచ్చిన డిజిటల్ చెల్లింపుల విప్లవంలో యూపీఐ గొప్ప సహకారం అందించిందని పేర్కొంది. గతేడాది డిసెంబర్‌లో, 782 కోట్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరిగాయని వెల్లడించింది. మొత్తం రూ. 12.82 లక్షల కోట్ల విలువైన చెల్లింపులు జరిగినట్టు చెప్పింది.
గతేడాది అక్టోబర్‌లో తొలిసారిగా యూపీఐ చెల్లింపులు రికార్డు స్థాయిలో రూ.12లక్షల కోట్ల మార్కును దాటాయి. అదే నవంబర్‌లో మాత్రం రూ.11.90లక్షల కోట్ల చెల్లింపులు జరిగాయి. చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలు లేకపోవడంతో ఎక్కువ మంది యూపీఐ వైపు మొగ్గు చూపుతున్నారు.