బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం ఉప్పెన. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ సాధించింది. ముఖ్యంగా ఇందులో హీరోయిన్ కృతి శెట్టి నటన విశేషంగా ఆకట్టుకుంది. అంతేకాకుండా యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే ప్రస్తుతం ఈ అమ్మడు వరుస అవకాశాలను అందుకుంటోంది.
ఇప్పటికే సుధీర్ బాబు… హీరోగా నటిస్తున్న ఆ అమ్మాయి గురించి నీకు చెప్పాలి సినిమాలో నటిస్తోంది. అలాగే నాని శ్యామ్ సింగ రాయ్ సినిమాలో కూడా నటించింది. ఈ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. మరోవైపు రామ్ లింగుస్వామి సినిమాకు కూడా ఓకే చెప్పింది. తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ తర్వాత సినిమాలో కూడా కృతిని తీసుకోబోతున్నారట. అంతేకాకుండా చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ సినిమాలో కూడా కృతి శెట్టి ని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.