కొత్త డైరెక్టర్ అయినప్పటికీ కథపై, హీరోపై నమ్మకంతో ఉప్పెనకు ఛాన్స్ దొరికింది. ఉప్పెనను మైత్రీమూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఆ సినిమా అనేక కారణాలతో రిలీజ్ వాయిదా పడినా రిలీజ్ కు ముందే మరో సినిమాకు డైరెక్టర్ బుచ్చిబాబుకు అడ్వాన్స్ ఇచ్చారు.
కానీ ఉప్పెన అనుకున్నదానికన్నా భారీ హిట్ అయ్యింది. పెద్ద హీరోలకు ఏమాత్రం తీసిపోలేదు. ఓటీటీ రిలీజ్ ఆఫర్స్ ను కాదని ధైర్యం చేసినందుకు నిర్మాణ సంస్థకు మంచి లాభమే వచ్చింది. దీంతో రెండో సినిమా మొదలుపెట్టకముందే మూడో సినిమా కూడా మాతోనే చేయాలంటూ డైరెక్టర్ బుచ్చిబాబు మరో అవకాశం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది.
హిట్ దర్శకులను కట్టిపడేసే అలవాటున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ… బుచ్చిబాబును కూడా తమ దగ్గరే ఉంచేసుకుంది.