డైరెక్టర్ కొత్తవాడైనా… పాత వాడైనా హిట్ సినిమా పడిందంటే చాలు ఆఫర్స్ హోరెత్తుతాయి. రిలీజ్ షో పూర్తైతే చాలు బుకింగ్ ఆఫర్స్ వస్తుంటాయి. సినిమాకు బజ్ క్రియేట్ అయితే అప్పటికే ఒప్పందాలు జరిగిపోతాయి. ఇప్పుడు ఉప్పెన సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు పరిస్థితి కూడా ఇదే.
సుకుమార్ శిష్యుడిగా అవకాశం దక్కించుకున్న ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుకు ఇప్పుడు ఫుల్ ఆఫర్స్ వస్తున్నాయి. సినిమాకు మంచి బజ్ ఏర్పడటం, ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ రావటంతో నిర్మాతలు, యంగ్ హీరోలు బుచ్చిబాబుతో సినిమాకు ట్రై చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పటికే బుచ్చిబాబుకు అడ్వాన్స్ కూడా పే చేయగా, డీవీవీ దానయ్యతో పాటు హారికా హాసిని క్రియేషన్స్ సినిమా చేసేందుకు ముందుకు వస్తున్నాయి.
ఇక యంగ్ హీరోలు నితిన్, నాని, సాయిధరమ్ తేజ్ వంటి హీరోలు మనం కూడా ఓ మూవీ చేద్దాం అంటూ ఆఫర్స్ ఇస్తున్నారట. ఇప్పుడే ఇలా ఉంటే సినిమా భారీ హిట్ కొడితే ఇంకెంతలా ఆఫర్స్ వచ్చి పడతాయో.