డైరెక్టర్ బుచ్చిబాబు సాన గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. ఉప్పెన సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు బుచ్చిబాబు. వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ సాధించింది. అలాగే నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. కాగా బుచ్చిబాబు తన తరువాత సినిమాను ఎవరితో చేయబోతున్నాడు అనేది ఎప్పటి నుంచో అందరిలోనూ ఆసక్తికరంగా మారింది.
ఆ మధ్య ఎన్టీఆర్ తో బుచ్చిబాబు సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఎన్టీఆర్ లైనప్ లో కొరటాల శివ, ప్రశాంత్ నీల్ వంటివారు ఉండటంతో బుచ్చిబాబు సినిమా వెనక్కి వెళ్లింది. అయితే ఈ లోపు ఓ యంగ్ హీరోతో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే ఆ హీరో కోసం వెతుకుతున్నాడట. మరి ఆ యంగ్ హీరో ఎవరు ఏంటి అనేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.