ఉప్పెన సినిమాతో తెలుగుకు తెరకు పరిచయం కానున్న హీరోయిన్ క్రితీ శెట్టి. సినిమా ఇంకా రిలీజ్ కాకున్నా… క్రితీ శెట్టికి వరుస పెట్టి ఆఫర్స్ వచ్చేస్తున్నాయి. తను కూడా వెంటవెంటనే సినిమాలను ఒప్పేసుకుంటుంది.
న్యాచురల్ స్టార్ నాని కొత్త సినిమా శ్యామ్ సింగ రాయ్ లో నటిస్తుండగా, సుధీర్ బాబు కొత్త సినిమాలో కూడా ఛాన్స్ దక్కించుకున్నట్లు ప్రచారం సాగుతుంది. తాజాగా క్రితీ శెట్టి మరో సినిమాకు సంతకం చేసినట్లు తెలుస్తోంది. గోపిచంద్ హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కనున్న అలివేలు వెంకటరమణ సినిమాలో కూడా ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనుంది.
ఇక హీరో సూర్య నెక్ట్స్ సినిమాకు కూడా క్రితీ శెట్టి పేరు వినిపిస్తుంది.