కొత్త హీరో.. కొత్త హీరోయిన్… కొత్త దర్శకుడు. కానీ సంచలన విజయం సాధించింది. ఉప్పెన సినిమా ఏకంగా 100కోట్లకు పైగా రాబట్టగలిగింది. బుచ్చిబాబు దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఉప్పెన. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.
ఫిబ్రవరి 12న విడుదలైన ఈ చిత్రం కు డిజిటల్ రైట్స్ కోసం పలు ఓటిటి సంస్థలు పోటీ పడ్డాయి. నెట్ ఫ్లిక్స్ ఏడు కోట్ల రూపాయలకు హక్కులు దక్కించుకుంది. ఏప్రిల్ 14 నుంచి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.