నూతన దర్శకుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో సాయిధరమ్ తేజ తమ్ముడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఉప్పెన. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుదల కావాల్సి ఉండగా కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడప్పుడే థియేటర్స్ ఓపెన్ అయ్యే పరిస్థితి కనిపించకపోవడంతో ఈ సినిమాను ఓటీటీ వేదికగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.
అయితే ఓటీటీ లో ఎలానూ విడుదల చేయాలని అనుకుంటున్నాము కాబట్టి ఎడిటింగ్ లేని వెర్షన్ ను రెండు భాగాలుగా విడుదల చేస్తే ఎలా ఉంటుందోనని ఆలోచిస్తున్నారట దర్శక నిర్మాతలు. త్వరలోనే ఏదో ఒక విషయం క్లారిటీ వచ్చే అవకాశం ఉందట. మరోవైపు ఈ సినిమాలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నారు.హీరోయిన్ గా క్రితిశెట్టి నటిస్తోంది.