వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఉప్పెన. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించగా.. ఇప్పటికే విడుదల అయిన సాంగ్స్ కు మంచి ఆదరణ లభిస్తోంది. అయితే గతేడాది రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.
తాజా సమాచారం ప్రకారం వాలెంటైన్స్ డే రోజు అంటే ఫిబ్రవరి 14న రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. సమ్మర్ రేసులో ఇప్పటికే చాలా సినిమాలు ఉండటంతో ఫిబ్రవరి 14 అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోందట.