ఓ మంచి లవ్ స్టోరీతో వచ్చి, ఫస్ట్ మూవీతోనే అందర్నీ మెప్పించిన ఉప్పెన సినిమా బాక్సాఫీసు వద్ద దూసుకపోతుంది. మంచి కలెక్షన్లు రాబడుతున్న ఈ సినిమా డిజిటల్ రిలీజ్ డేట్ లాక్ అయ్యింది. ఈ మూవీని నెట్ ఫ్లిక్స్ రిలీజ్ చేయనుంది.
రికార్డు ధర చెల్లించి ఈ సినిమాను దక్కించుకున్నప్పటికీ, అగ్రిమెంట్ ప్రకారం సినిమా రిలీజ్ అయిన 60రోజుల తర్వాతే డిజిటల్ రిలీజ్ చేయాలన్నది కండిషన్. దీంతో ఏప్రిల్ 11న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకరానుంది నెట్ ఫ్లిక్స్. బుచ్చిబాబు దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, క్రితీ శర్మ హీరోహీరోయిన్లుగా నటించగా, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.