మంచి బజ్ క్రియేట్ చేసుకొని రిలీజ్ అయిన సినిమా ఉప్పెన. పేరుకు చిన్న సినిమానే అయినా… కావాల్సినంత హైప్, ప్రచారం సంపాదించుకోగలిగింది. సినిమాపై నమ్మకంతో ఓటీటీ రిలీజ్ కు కాకుండ థియేటర్ రిలీజ్ చేస్తుండగా, 100శాతం థియేటర్లు ఓపెన్ అయ్యాక రిలీజ్ అవుతున్న సినిమా ఇది.
కొత్త దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ సినిమాలో చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. క్రితీ శెట్టి హీరోయిన్ కాగా, దేవీ శ్రీప్రసాద్ మ్యూజిక్ అందించారు.
సినిమా ఎలా ఉందంటే…
సముద్రతీరాన ఉన్న ఓ మత్స్యకార కుటుంబంలోని పేదింటి యువకుడు ఆసిగా వైష్ణవ్ తేజ్, గ్రామ పెద్దగా ఉన్న వ్యాపార వేత్త అయిన రాయణంగా విజయ్ సేతుపతి, ఆయన కూతురిగా బేబమ్మ అంటే కృతి శెట్టి నటించారు. ఆసి బేబమ్మను ప్రేమించటం, ఆమెకు విషయం తెలియకపోవటంతో వన్ సైడ్ లవ్ ట్రాక్ కొనసాగుతుంది. ఇక రాయణంకు పరువు అంటే ప్రాణంగా భావిస్తాడు. కూతురుకు కుర్రాళ్ల గాలి తగలొద్దనే ఉమెన్స్ కాలేజీలో చదివిస్తాడు. పైగా స్పెషల్ బస్. కానీ బేబమ్మ ఆసి ప్రేమలో పడటం… రాయణం దాడులతో సినిమా సాగుతుంది.
ఫస్ట్ సినిమానే అయినా వైష్ణవ్ నటన అలా అనిపించదు. తొలి సినిమా అని గుర్తుపట్టలేం. ఎమోషనల్ సీన్స్ బాగా చేశాడని చెప్పుకోవచ్చు. బేబమ్మ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. ఇద్దరూ పాత్రల్లో జీవించిపోయారు. ఇక విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరంతా పోటీపడి మరీ నటించారు.
కథ లైన్ పాతదే సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా డైరెక్టర్ బాగా మేనేజ్ చేశాడు. క్లైమాక్స్ మాత్రం కొత్తగా చూపించాడు. మెగా ఫ్యామిలీ హీరో కావటం కథకు ప్లస్ అయ్యింది. కథను కళ్లకు కట్టినట్లుగా తెరపై చూపించాడు. తనదైన స్క్రీన్‌ప్లేతో పాత స్టోరీకి ట్రీట్‌మెంట్ కాస్త డిఫరెంట్‌గా ఇచ్చాడు. ఈ సినిమాతో డైరెక్టర్ మరిన్ని సినిమా అవకాశాలు పొందుతాడు.
ఓవరాల్ గా ఉప్పెన్ మంచి ఫీల్ గుడ్ మూవీ అని చెప్పొచ్చు.