మెగా ఫ్యామిలీ నుంచి వెండితెరకు పరిచయం అవుతున్న మరో హీరో వైష్ణవ్ తేజ్. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వస్తున్న ఉప్పెన సినిమాతో వైష్ణవ్ తేజ్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆ కట్టుకుంది. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్ విజయ్ సేతుపతి లుక్ ని రిలీజ్ చేసింది. బ్లాక్ అంబాసిడర్ కార్ పక్కన నిలుచుని గడ్డం, మీసాలతో సేతుపతి కనిపిస్తున్నాడు. మరో లుక్ లో సిగరెట్ కలుస్తూ కనిపిస్తున్నాడు.
మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న వైష్ణవ్ తేజ్ ఈ సినిమాతో పరిచయం కావటంతో పాటు విజయ్ సేతుపతి విలన్ గా నటించటంతో ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ టీం, సుకుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. క్రితి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 2 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తుంది.