నది ఒడ్డున సాగే ఓ ప్రేమకథతో సుకుమార్ ఇచ్చిన కథకు ఆయన శిష్యుడు చిట్టిబాబు ఇచ్చిన దృశ్యరూపమే ఉప్పెన. కరోనా కారణంగా దాదాపు ఏడాది పాటు విడుదల వాయిదా పడినా, సినిమాపై నమ్మకంతో థియేటర్ రిలీజ్ కే మొగ్గు చూపారు. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు కానుకగా… ఫిబ్రవరి 12నే సినిమాను విడుదల చేస్తున్నారు.
ఈ సినిమా ద్వారా మెగా కాంపౌండ్ నుండి మరో హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ట్రైలర్ ద్వారానే సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాడు. ఇప్పటికే దేవీశ్రీ తన మ్యూజిక్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేయగా, విలన్ రోల్ లో విజయ్ సేతుపతి కనిపించనున్నాడు.