ఉప్పెన సినిమాతో సంచలన విజయం సాధించిన హీరో వైష్ణవ్ తేజ్. మెగా కాంపాండ్ నుండి వచ్చిన వ్యక్తే అయినప్పటికీ నటనతో అందర్నీ ఆకట్టుకున్నాడు. ఉప్పెన ఇప్పటికే భారీ వసూళ్లు రాబడుతోంది. వైష్ణవ్ తేజ్ ఇప్పటికే రెండో సినిమా పూర్తి చేశాడు. క్రిష్ దర్శకత్వంలో రకుల్ ప్రీత్ హీరోయిన్ గా సినిమా వస్తోంది.
ముచ్చెటగా మూడో సినిమాను అక్కినేని నాగార్జున అన్నపూర్ణ బ్యానర్ లో చేసే అవకాశం ఉంది. ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథకు వైష్ణవ్ ఓకే చేశారని, ఈ సినిమాను నాగ్ ప్రొడ్యూస్ చేయనున్నారు. అయితే, కథను మెగాస్టార్ చిరంజీవి ఫైనల్ చేయాల్సి ఉన్నట్లు తెలుస్తోంది.