ఐపీఎల్-2021 అఫీషియల్ పార్ట్‌నర్‌గా ప్రముఖ డిజిటల్ బ్రోకరేజ్ సంస్థ అప్‌స్టాక్స్ అవకాశం దక్కించుకుంది. ఈ మేరకు బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది. ఏప్రిల్ 9 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ అఫీషియల్ పార్టనర్‌గా అప్‌స్టాక్స్ వ్యవహరిస్తుందని వెల్లడించింది. రాబోయే రోజుల్లోనూ అప్‌స్టాక్స్‌తో ఈ ఒప్పందం కొనసాగుతుందని స్పష్టం చేసింది.
అప్‌స్టాక్స్ అధికారిక భాగస్వామిగా కొనసాగుతుండగా.. టైటిల్ స్పానర్‌గా ఈ ఏడాది మళ్లీ ప్రముఖ మొబైల్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ VIVO వ్యవహరించనుంది. కాగా గతేడాది డ్రీమ్ 11 టైటిల్ స్పానర్‌గా వ్యవహరించింది.
గాల్వన్ ఘర్షణ అనంతరం.. చైనాకు చెందిన కంపెనీలపై దేశంలో తీవ్ర వ్యతిరేకత నెలకొనడంతో VIVO గతేడాది టైటిల్ స్పాన్సర్‌షిప్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో ఆ స్థానాన్ని డ్రీమ్ 11 దక్కించుకుంది. ఈసారి కూడా డ్రీమ్ 11 టైటిల్ స్పాన్సర్‌షిప్ ను దక్కించుకునేందుకు తీవ్రంగానే ప్రయత్నించింది. కానీ VIVO బీసీసీఐకి భారీ మొత్తాన్ని ఆఫర్ చేయడంతో డ్రీమ్ 11 వెనకడుగు వేయక తప్పలేదు.