ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం మొదలై ఏడాది పూర్తవుతోంది. ఇప్పటికీ ఇంకా ఇరు దేశాల మధ్య యుద్ధం అలానే కొనసాగుతోంది. యుద్దం నేపథ్యంలో ఇరు దేశాలకు తీవ్ర నష్టం కలిగింది. ఇరు దేశాల సైనికులు మరణించారు. ఎంతో మంది ప్రజలు, చిన్నారులు మరణించారు. తీవ్ర ఆస్తినష్టం కూడా జరిగింది.
కానీ రష్యా మాత్రం తన మొండి పట్టు వీడటం లేదు. ఇది ఇలా వుంటే రష్యా దాడిలో ధ్వంసమైన ఉక్రెయిన్ నగరం మరింకాకు సంబంధించిన ఫోటోలను ఆ దేశానికి చెందిన జర్నలిస్ట్ క్రిస్టోఫర్ మిల్లర్ ట్విట్టర్ లో షేర్ చేశారు. ఆ నగరంలో ఒక్క నివాస భవనం కూడా కనిపించకుండా ధ్వంసమై పోవడం విచారకర విషయం.
ఈ చిత్రాలను పంచుకుంటూ మిల్లర్… మరింకా ఒకప్పుడు 10,000 మంది నివాసితులతో కూడిన నిశ్శబ్దమైన పడకగది లాగా ఉండేదన్నారు. డెనెటెస్క్‌కు పశ్చిమాన చెట్లతో కప్పబడిన అందమైన వీధులు వుండేవని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు మనం దాన్ని గతమని చెప్పాలన్నారు.
రష్యన్ సైన్యం దాన్ని భూమిపై నుంచి తుడిచిపెట్టిందని ఆయన పేర్కొన్నారు. ఈ నగరం ఇప్పుడు శ్మశానాన్ని తలిపిస్తోందన్నారు. మరింకా నగరంలో తాను ఎక్కువ సమయం గడుపుతూ ఉండేవాడినన్నారు. ముఖ్యంగా అక్కడ వేసవిలో అక్కడ చక్కని వాతావరణం ఉండేదన్నారు. కానీ ఇప్పుడ అదంతా నాశనమైందన్నారు.