డిజైనర్ ఫరాఖాన్ అలీకి, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఉర్వి జావెద్ కు మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ జరుగుతోంది. ఉర్వి డ్రెస్సింగ్ సెన్స్ అసహ్యకరంగా ఉంటుందని ఫరా ట్వీట్ చేయగా.. మంచి డ్రెస్సింగ్ సెన్స్ అంటే ఎలా ఉంటుందో వివరిస్తే నేర్చుకుంటానని ఉర్వి రిప్లై ఇచ్చింది. దీంతో ఇద్దరి మధ్య వార్ పీక్స్ కు వెళ్లిపోయింది.
ఇటీవల ఓ కార్యక్రమానికి వెళ్లింది ఉర్వి. అక్కడ ఆమెను గుర్తుపట్టకపోవడంతో సెక్యూరిటీ గార్డుతో గొడవ పడింది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఆ వీడియోపై డిజైనర్ ఫరాఖాన్ అలీ స్పందిస్తూ ‘ఇలా చెబుతున్నందుకు క్షమించండి. కానీ.. ఈ యువతి అసహ్యకరంగా డ్రెసింగ్ చేసుకున్నందుకు ఆమెను మందలించాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఆమెను ఎగతాళి చేస్తున్నారు. ఆమె దుస్తులు ధరించే విధానం ప్రజలకు నచ్చిందని ఆమె భావిస్తోంది. ఎవరైనా ఆమెకు చెబితే బాగుంటుంది’ అని కామెంట్ చేసింది.
దానికి ఉర్వి కూడా అంతే ఘాటుగా సమాధానం ఇచ్చింది. ‘ఆకర్షణీయమైన డ్రెస్సింగ్ సెన్స్ అంటే ఏంటో వివరిస్తారా ప్లీజ్. నా డ్రెసింగ్ సెన్స్ ప్రజలకు నచ్చటం లేదని అందుకే దాన్ని మార్చుకోవాలని అంటున్నారు. అలా అయితే మీ ఫ్యామిలీ గురించి బయట చాలామంది మాట్లాడుకుంటున్నారు. వారి మాటలు విని మీ కుటుంబం వాళ్లు కూడా మారాలా?’ అంటూ రిప్లై ఇచ్చింది.
ఉర్వికి వివాదాలు కొత్తకాదు. గతంలోనూ పలుమార్లు ఆమెపై కామెంట్లు చేశారు. ముస్లిం సామాజిక వర్గానికి చెందిన మహిళ అయినందువల్ల ఆమె డ్రెస్సింగ్ విధానంపై పలువురు అభ్యంతరం చేస్తూ హిజాబ్ ధరించాలంటూ ట్రోలింగ్ చేస్తూ ఉంటారు.