గుడ్‌బై కాంగ్రెస్.. ! - Tolivelugu

గుడ్‌బై కాంగ్రెస్.. !

బాలివుడ్ స్టార్ ఊర్మిళ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. మరి ఆమె రాజకీయాల్లో కొనసాగుతారా? వేరే పార్టీలో చేరతారా? లేక మూవీస్‌లో మరో ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తారా?

ముంబై: ‘రంగీల’ ఊర్మిళ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. లోక్‌సభ ఎన్నికలకు కొద్దిగా ముందు ఊర్మిళ మటోండ్కర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఒక మంచి లక్ష్యం కోసం ముంబై కాంగ్రెస్‌లో తాను పని చేయాలనుకున్నానని, ఐతే, ఇక్కడ అంతర్గత రాజకీయాలు, స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగపడటం తనకు ఇష్టం లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని డిసైడయ్యానని ఊర్మిళ ఒక వార్తా సంస్థకు చెప్పారు. ముంబై నార్త్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీచేసిన ఊర్మిళ, బీజేపీ అభ్యర్థి గోపాల్ షెట్టి చేతిలో 4 లక్షల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక ఊర్మిళ పాలిటిక్స్ వదిలేస్తారని అప్పుడే ప్రచారం జరిగింది. అబ్బే.. అలంటిదేం లేదని ఊర్మిళ తోసిపుచ్చారు. ఎన్నికల్లో ఓడినప్పటికీ మంచి పోరాటం చేశానని, పాలిటిక్స్ వదిలిపెట్టి ఎక్కడికీ వెళ్లేదిలేదని చెప్పారు. ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp