ఇండియన్ క్రికెటర్ రిషబ్ పంత్ కి, బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చిందా? ఇప్పుడు ఈ కిస్ వ్యవహారమే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలు ఈ జంట తీరే వేరు. ఒకరిపై మరొకరు హాట్ కామెంట్స్ చేసుకుంటూనే.. అప్పటికప్పుడే తియ్యగా మాట్లాడేసుకుంటారు. కానీ ఎప్పుడూ నెట్టింట్లో మాత్రం హాట్ టాపిక్ గా ఉంటారు. మళ్లీ మరోసారి ఈ జంట సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. కొన్నాళ్లుగా వీరి లవ్ ట్రాక్ కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం అన్న తీరుగా సాగుతోంది.
క్రికెటర్ రిషబ్ పంత్ బర్త్ డే సందర్భంగా ఊర్వశి రౌటేలా తనదైన స్టైల్లో బర్త్ డే విషెస్ చెప్పింది. ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో రెడ్ కలర్ డ్రెస్ లో ఈ ముద్దుగుమ్మ ఓ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చింది. వీడియోతో పాటు హ్యాపీ బర్త్ డే అని రాసి పెట్టింది. కానీ బర్త్ డే ఎవరిదో చెప్పకుండా కేవలం విషెస్ మాత్రం చెప్పింది. అయితే ఈ అమ్మడు అక్కడే దొరికిపోయింది. లా అంటే.. ఈ రోజు టీమ్ ఇండియా వికెట్ కీపర్ పంత్ పుట్టిన రోజు.
దీంతో ఊర్వశి పోస్ట్ చేసిన వీడియోకి నెటిజన్లు సమాధానం ఇస్తున్నారు. ఆ విషెస్ రిషబ్ పంత్ కే అని కామెంట్స్ చేస్తున్నారు. ఇన్ డైరెక్ట్ గా రిషబ్ కే బర్త్ డే విషెస్ చెప్పిందని మరికొందరు నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. దీంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ కామెంట్స్ పై ఊర్వశి ఇప్పటివరకూ స్పందించలేదు.
కాగా కొంతకాలం నుంచి ఇండియన్ క్రికెటర్ రిషబ్ తో మాటల యుద్ధానికి దిగుతోంది బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా. ప్రతిరోజు వార్తల్లో నిలుస్తూ.. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్‌కు గురైంది. అయితే రిలేషన్ షిప్లో ఉన్న వీరిద్దరూ విడిపోయారని అందుకే ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు రిషబ్ పై సెటైర్లు వేస్తూ వచ్చింది. అయితే ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఊర్వశి ఏం చెప్పాలో తెలియట్లేదు.. కానీ సారీ చెప్పాలనుకుంటున్నా.. అంటూ పేర్కొంది. రిషబ్ ని ఉద్దేశించే ఊర్వశి స్పందించని కథనాలు వచ్చాయి. మళ్లీ ఇప్పుడు బర్త్ డే విషెస్ తో మరోసారి వార్తల్లో నిలిచింది ఈ బ్యూటీ.