బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతాలాకు వింత అనుభవం ఎదురయ్యింది. అయినప్పటికీ ఆమె చిరునవ్వుతోనే దాన్ని స్వాగతించారు. అసలు విషయం ఏంటంటే.. ఈ బ్యూటీ భారత క్రికెటర్ రిషబ్ పంత్ తో డేటింగ్ లో ఉందంటూ కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. కానీ.. అది బ్రేకప్ అయ్యిందన్న ప్రచారం జరిగింది.
తాజాగా ఓ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు వెళ్లిన ఊర్వశిని పంత్ అభిమానులు టీజ్ చేశారు. ఆమెకు గతాన్ని గుర్తు చేస్తూ రిషబ్ అంటూ కేకలు వేశారు. అయినప్పటికీ వాటిని ఆమె చిరునవ్వుతోనే స్వీకరించారు. 2018లో ఐపీఎల్ మ్యాచ్ లు అన్నింటికీ వరుసగా హాజరైన ఊర్వశి.. స్టాండ్స్ నుంచే పంత్ ను ఉత్సాహపరుస్తూ కనిపించింది. దాంతో వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందంటూ తెగ ప్రచారం జరిగింది.
వాళ్లిద్దరూ ఎప్పుడూ, ఎక్కడా కూడా తమ వ్యవహారం గురించి కానీ, తమపై ట్రోల్ అవుతున్న వార్తల గురించి కానీ.. నోరు విప్పలేదు. దీంతో వారిద్దరూ విడిపోయారంటూ నెటిజన్లే చెప్పేసుకున్నారు. అయితే.. తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఊర్వశిని రిషబ్ ఫ్యాన్స్ టీజ్ చేయడంతో పాత వార్తలన్నీ మళ్లీ తెరపైకి వస్తున్నాయి.
గతంలో ఊర్వశికి పంత్ తో ఉన్న పరిచయాన్ని గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో మళ్లీ చర్చ మొదలైంది. ప్రస్తుతం ఊర్వశి వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.